News April 19, 2025
వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNRలో అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, బాపు, జరఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనేపదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.
Similar News
News December 16, 2025
హనుమంతుడి కుమారుడి గురించి మీకు తెలుసా?

పురాణాల ప్రకారం.. హనుమంతుడి చెమట చుక్క ద్వారా ఓ మకరానికి మకరధ్వజుడు జన్మించాడు. ఆయన పాతాళ లోకంలో ద్వారపాలకుడిగా పనిచేశాడు. అయితే ఓనాడు రామలక్ష్మణులను పాతాళంలో బంధిస్తారు. అప్పుడు హనుమంతుడు వారిని రక్షించడానికి అక్కడికి వెళ్తాడు. పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి, తన కుమారుడైన మకరధ్వజుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. చివరకు నిజం తెలుసుకొని మకరధ్వజుడు శ్రీరాముడికి సాయం చేస్తాడు.
News December 16, 2025
క్యాబేజీ, కాలీఫ్లవర్‌లో నారుకుళ్లు తెగులు నివారణ

క్యాబేజీ, కాలీఫ్లవర్ నారుమడుల్లో నారుకుళ్లు తెగులు కనిపిస్తుంది. దీని వల్ల నారు మొక్కల కాండం, మొదళ్లు మెత్తగా తయారై కుళ్లి, వడలిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఎత్తైన మడులపై లేదా ప్రోట్రేలలో నారును పెంచాలి. విత్తనం పలుచగా వరుసల్లో వేయాలి. ఎక్కువ నీటి తడులను ఇవ్వకూడదు. నారు మొలిచిన తర్వాత లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
News December 16, 2025
మోదీ.. ఒక అభినవ గాడ్సే: షర్మిల

ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ఆమె ఖండించారు. ఇది జాతిపిత మహాత్మా గాంధీకి బీజేపీ చేస్తున్న తీరని ద్రోహం అని, మోదీని ‘అభినవ గాడ్సే, నాథూరామ్ వారసుడు’గా అభివర్ణించారు. గాంధీజీ పేరు చెరిపేసే కుట్రను దేశం మొత్తం, ముఖ్యంగా రాష్ట్ర ఎంపీలు ప్రతిఘటించాలని ఆమె ట్వీట్ చేశారు.


