News April 19, 2025
NGKL: ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించిన MLA రాజేశ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుని ని విశ్రాంతి తీసుకుంటున్నాడు. శుక్రవారం ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాక్షించారు. నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
అవిశ్వాసంతో పదవి కోల్పోయిన విశాఖ తొలి మేయర్

అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన మొదటి మేయర్‌గా హరివెంకట కుమారి నిలిచారు. విశాఖ మున్సిపాలిటీ 1979లో కార్పొరేషన్‌గా మారింది. 1981లో జరిగిన ఎన్నికల్లో మొదటి మేయర్‌గా N.S.N.రెడ్డి(1981-1986) గెలిచారు. అనంతరం 1987లో D.V సుబ్బారావు, 1995లో సబ్బం హరి, 2005లో రాజాన రమణి మేయర్లుగా పనిచేశారు. 2005లో G.V.M.C ఆవిర్భవించినాక 2007లో మేయర్‌గా జనార్దనరావు ఎన్నికయ్యారు. 2021లో హరివెంకట కుమారి పదవి చేపట్టారు.
News April 20, 2025
ఉమ్మడి గుంటూరులో 1143 పోస్టులు

రాష్ట్ర్లంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 16347 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా ఉమ్మడి గుంటూరులో 1143 కొలువులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్ఏ తెలుగు 40, ఉర్దూ 2, హిందీ 57, ఇంగ్లీష్ 69, మ్యాథ్స్ 35, ఫిజిక్స్ 58, బయలాజికల్ సైన్స్ (తెలుగు 85, ఉర్దూ 1), సోషల్ (తెలుగు 106, ఉర్దూ 03) ఎస్.ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 166, ఎస్జీటీ (తెలుగు 470, ఉర్దూ 51)
News April 20, 2025
KU డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.