News April 19, 2025
పల్నాడు జిల్లాకు మహర్దశ

రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌లో జిల్లాను కలపటంతో పల్నాడుకు మహర్దశ పట్టింది. కొండమోడు పేరేచర్ల హైవే పనులు ప్రారంభానికి సిద్ధం కావడంతో అమరావతికి రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. కృష్ణానది పరివాహ ప్రాంతం కావడంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల, ఎత్తిపోతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ, దైద, గుత్తికొండ వంటి పర్యాటక ప్రాంతాలు జిల్లా పరిధిలోకి ఉండటంతో బలమైన జిల్లాగా రూపాంతరం చెందింది.
Similar News
News April 20, 2025
మాజీ డీజీపీ దారుణ హత్య

కర్ణాటక మాజీ DGP ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారు. బెంగళూర్‌లోని ఆయన నివాసంలో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శరీరంలో పలు చోట్ల కత్తిపోట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయనను భార్యే చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి 2017 వరకూ కర్ణాటక డీజీపీగా ఓం ప్రకాశ్ పనిచేశారు.
News April 20, 2025
నా పేరు తొలగింపుపై కోర్టుకెళ్తా: అజారుద్దీన్

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ HCA అంబుడ్స్‌మన్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇండియా జట్టుకు 10ఏళ్లు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి <<16150970>>పేరు తొలగించమనటం<<>> సిగ్గుచేటని అన్నారు. తానేమి మూర్ఖుడని కాదని, స్టాండ్‌కు పేరు పెట్టె సమయానికే తన పదవీకాలం ముగిసిందని పేర్కొన్నారు. అవినీతి కార్యకలాపాల్లో పాల్గొననందుకే కొంతమంది అధికారులు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
News April 20, 2025
రేపు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు

USA ఉపాధ్యక్షుడు JD వాన్స్ రేపటి నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా ఈ నెల 24 వరకు పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు. రేపు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో దిగనున్న ఆయనకు క్యాబినెట్ మంత్రి స్వాగతం పలకనున్నారు. ఢిల్లీలోని అక్షర్‌ధామ్, చేనేత ఉత్పత్తుల దుకాణాలు సందర్శించనున్నారు. సా.6.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యి భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై వాన్స్ చర్చిస్తారు.