News April 19, 2025

ఊట్కూర్‌లో పురాతన మఠాల చరిత్ర తెలుసా..?

image

మన దేశం అనేక సంస్థానాలు, మఠాలతో అలనాడు ఓ వెలుగు వెలిగింది. ఈ పరంపరలో NRPT జిల్లా ఊట్కూరులోని మాగనూరు నేరడుగం పురాతన పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం ఒకటి. ఈ మఠాన్ని శ్రీసిద్ధ లింగేశ్వర మహాస్వామి స్థాపించారు. అనంతరం 1900-1914 కాలంలో 2వ సిద్ధలింగ మహాస్వామి సంకల్ప అనుష్టానంతో 12 స్థలాల్లో మఠాలు నెలకొల్పారు. అందులో ఒకటి ఊట్కూర్‌లోని పురాతన మఠం. ఇక్కడ పేద పిల్లలకు విద్య అందించారని స్థానికులు తెలిపారు. 

Similar News

News April 20, 2025

మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. అనాజిపురం-దాచారం గ్రామాల మధ్య ఉన్న పత్తి మిల్లు వద్ద బైక్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంపటికి చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2025

HYD: రెసోనెన్స్ విద్యార్థుల జయకేతనం

image

JEE మెయిన్స్-2025 ఫలితాలలో రెసోనెన్స్ విద్యార్థులు సత్తా చాటారు. మెయిన్స్‌లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. అర్చిస్మాన్ అనే స్టూడెంట్ 295 స్కోర్ చేయడంతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చిందన్నారు. మొత్తం 285 మంది విద్యార్థులు విభిన్న సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ పైగా మార్కులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం సన్మానించింది.

News April 20, 2025

రేపు వనపర్తిలో ప్రజావాణి రద్దు

image

ఈనెల 26వ తేదీ వరకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమం ఉంటాయని వనపర్తి కలెక్టర్ ఆదర్స్ సురభి తెలిపారు. ఈ విషయమై రేపు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఇది గమనించాలని సహకరించాలని కోరారు.

error: Content is protected !!