News April 19, 2025
బూర్జ : స్విమ్మింగ్‌లో అరుదైన రికార్డు

బూర్జ మండలం డొంకలపర్తికి చెందిన గణేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి పారా స్విమ్మర్‌గా అరుదైన రికార్డు సాధించారు. ఏలూరు క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ గణేశ్ శుక్రవారం శ్రీలంకలోని తలైమన్నారు నుంచి భారతదేశంలోని ధనుష్కోటి వరకు పోటీజరిగింది. 28 కిలోమీటర్లను 10:30 గంటల్లో స్విమ్ చేసి రికార్డు నెలకొల్పారని AP పారాస్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి వి. రామస్వామి తెలిపారు.
Similar News
News September 11, 2025
నేపాల్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న సిక్కోలు వాసులు

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.
News September 11, 2025
ఎల్.ఎన్.పేట: పాముకాటుతో వ్యక్తి మృతి

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News September 11, 2025
నేపాల్‌లో తెలుగువారి కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్

నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్‌కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.