News April 19, 2025
కడపలో పోలీసుల శ్రమదానం

నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే పోలీసులు చీపుర చేతబట్టి చెత్త ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
Similar News
News November 10, 2025
కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 10, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


