News April 19, 2025

భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూ భారతి చట్టం: BHPL కలెక్టర్

image

భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూ భారతి చట్టం తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాటారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన అవగాహన కల్పించారు. భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందని కలెక్టర్ అన్నారు.

Similar News

News April 20, 2025

మాజీ డీజీపీ దారుణ హత్య

image

కర్ణాటక మాజీ DGP ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారు. బెంగళూర్‌లోని ఆయన నివాసంలో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శరీరంలో పలు చోట్ల కత్తిపోట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయనను భార్యే చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి 2017 వరకూ కర్ణాటక డీజీపీగా ఓం ప్రకాశ్ పనిచేశారు.

News April 20, 2025

నా పేరు తొలగింపుపై కోర్టుకెళ్తా: అజారుద్దీన్

image

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ HCA అంబుడ్స్‌మన్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇండియా జట్టుకు 10ఏళ్లు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి <<16150970>>పేరు తొలగించమనటం<<>> సిగ్గుచేటని అన్నారు. తానేమి మూర్ఖుడని కాదని, స్టాండ్‌కు పేరు పెట్టె సమయానికే తన పదవీకాలం ముగిసిందని పేర్కొన్నారు. అవినీతి కార్యకలాపాల్లో పాల్గొననందుకే కొంతమంది అధికారులు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 20, 2025

రేపు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు

image

USA ఉపాధ్యక్షుడు JD వాన్స్ రేపటి నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా ఈ నెల 24 వరకు పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు. రేపు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో దిగనున్న ఆయనకు క్యాబినెట్ మంత్రి స్వాగతం పలకనున్నారు. ఢిల్లీలోని అక్షర్‌ధామ్, చేనేత ఉత్పత్తుల దుకాణాలు సందర్శించనున్నారు. సా.6.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యి భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై వాన్స్ చర్చిస్తారు.

error: Content is protected !!