News March 28, 2024

నెల్లూరు: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

నెల్లూరు జిల్లా, కందుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకొల్లు నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 13, 2026

హైవేల వెంట వేసైడ్ అమెనిటీస్‌కు పెట్టుబడిదారుల ఆసక్తి : కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు, హైవే మార్గాల వెంట ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలను కల్పించే వేసైడ్ అమెనిటీస్ (Wayside Amenities) ఏర్పాటుకు పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన ఆసక్తి వ్యక్తమవుతోందని కలెక్టర్ హిమాన్షు శుక్ల సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రయాణికులకు సౌకర్యంగా ఫుడ్ కోర్టులు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిక్ వాహనాలకు EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

News March 12, 2026

నెల్లూరు: రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షలకు ఉచిత శిక్షణ

image

BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్-D 2026 పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారి పి. వెంకట లక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన BC,SC,ST కులాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక కాబడిన 100 మంది అభ్యర్థులకు ఈనెల 25వ తేదీ నుంచి ఈ ఉచిత శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తామన్నారు.

News March 12, 2026

గూడూరు ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

image

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇవాళ జరుగుతున్న మంత్రి లోకేశ్ పర్యటనకు ఎమ్మెల్యే సునీల్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ కాన్వాయ్‌లో వెళ్తున్న సునీల్ కుమార్ కారుకు అల్లూరు మండలం, సున్నపుబట్టి వద్ద త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారందరూ సురక్షితంగా బయట పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.