News April 19, 2025
నిర్మల్‌లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్ జిల్లాలో శనివారం 42.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు అనుకోని అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం 42.5, సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News January 15, 2026
కేటీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

కరీంనగర్‌లో ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. ఉమ్మడి జిల్లా నూతన సర్పంచుల అభినందన సభకు కేటీఆర్ హాజరుకావాల్సి ఉండగా.. అదే రోజు నుంచి ప్రభుత్వం సర్పంచులకు శిక్షణ తరగతులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. సభ నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
News January 15, 2026
కామారెడ్డి: రేపే అన్ని వివరాలతో కూడిన తుది ఓటర్ల జాబితా

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పూర్తిస్థాయి తుది ఓటర్ల జాబితాను(ఫోటోలతో కూడిన) అన్ని వివరాలతో రేపు అధికారులు ప్రకటించనున్నారు. మొత్తం 92 వార్డుల తుది జాబితాలో పురుషులు, మహిళలు, ఇతరుల వారీగా ఓటర్ల వివరాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే బూత్‌ల వివరాలు, మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించగా ఏ వార్డు కు ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.
News January 15, 2026
BREAKING: HYD: అడవిలో విషపు కాయలు తిని చిన్నారులకు అస్వస్థత

పటాన్‌చెరు నియోజకవర్గంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు.. రామచంద్రాపురం పరిధి బండ్లగూడలో బిహార్‌కు చెందిన 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు స్థానిక అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లకు ఉన్న విషపు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించగా అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


