News April 19, 2025

ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ

image

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. అధికారులు 8 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం వాంగ్మూలంపై ఎంపీ సంతకం తీసుకున్నారు. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అధికారులు విచారించారు.

Similar News

News January 14, 2026

నిష్క్రమిస్తోన్న ఈశాన్య రుతుపవనాలు

image

AP: ఈశాన్య రుతుపవనాలు 3 రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల దిశలో మార్పుతో క్రమంగా వైదొలుగుతాయని పేర్కొంది. మరోవైపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News January 14, 2026

గర్భిణుల్లో విటమిన్ D లోపం ఉంటే ఈ సమస్యలు

image

ప్రెగ్నెన్సీలో మహిళలు అన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుక‌తో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గ‌ర్భిణుల్లో విట‌మిన్ డి లోపం ఉండ‌డం వ‌ల్ల శిశువులు అధిక బ‌రువు, గుండె జ‌బ్బులు, మ‌ల్టిపుల్ స్లెరోసిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్ D లోపం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

News January 14, 2026

డెయిరీఫామ్.. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

image

గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్ పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు. 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్‌లో 230 ఆవులు, గేదెలున్నాయి. రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తూ 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలు అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయమే లక్ష్యమంటున్నారు. ఈమె సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.