News April 19, 2025

అమరాపురం: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

image

ఉమ్మడి అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని కాచికుంటకు చెందిన యువకుడు మంజునాథ్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాచికుంట గ్రామంలో ఓ రైతుకు చెందిన పొలంలో యువకుడు ట్రాక్టర్‌తో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 9, 2025

అనంత: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 401 అర్జీలు

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.

అనంతపురం జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు

image

అనంతపురం జిల్లాకు ఈనెల 10న CBN విచ్చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం నగరానికి సమీపాన ఉన్న వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా NH-44 జాతీయ రహదారికి మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.