News March 28, 2024

MBNR: ఉప ఎన్నికలకు ఏర్పాటు పూర్తి.. బరిలో ఉన్నది వీరే!

image

MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నిక కోసం మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్‌), నవీన్‌కుమార్‌రెడ్డి(బీఆర్ఎస్), సుదర్శన్‌గౌడ్‌(స్వతంత్ర అభ్యర్థి) బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా క్యాంపులో ఉన్నారు. వీరు నిన్న కర్ణాటకకు చేరుకున్నారు. పోలింగ్‌ టైంకి కేంద్రాలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

Similar News

News March 28, 2026

MBNR: కొత్త పింఛన్ కోసం.. నాలుగేళ్లుగా ఎదురుచూపు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశావాహులు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అప్పటి BRS ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొత్తగా 2 లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని తాజా బడ్జెట్‌లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే చాలా వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. మరి ఎదురుచూపులకు తెరపడేనా..!

News March 28, 2026

MBNR: పారుపల్లిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం పారుపల్లిలో 39.0 అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. దేవరకద్ర, కౌకుంట్ల, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 38.9, మహమ్మదాబాద్, చిన్నచింతకుంట 38.8, మహబూబ్‌నగర్ అర్బన్ 38.7, అడ్డాకుల 38.6, భూత్పూర్ మండలం కొత్త మొల్గర, మిడ్జిల్ మండలం దోనూరు, నవాబుపేట మండలం కొల్లూరు 38.5, హన్వాడ 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది.

News March 28, 2026

డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి

image

డోర్నకల్-గద్వాల మధ్య 296km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా సాగుతుంది. ఈ లైన్ సింగరేణి బొగ్గు రవాణాకు & తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల కనెక్టివిటీకి, సామాజిక- ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జడ్చర్ల-నంద్యాల లైన్ ట్రాఫిక్ (182km) తక్కువగా ఉన్నట్లు తెలిపారు.