News April 19, 2025
బాపట్ల: ఉద్యోగాల పేరిట రూ.1.5కోట్ల వసూలు.. మోసగాడి అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసి రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసిన వ్యక్తిని తెనాలి త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమరావతి కాలనీకి చెందిన తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటేరియట్‌లో ఏఎస్ఓగా పని చేస్తున్నానంటూ ఫేక్ ఐడీలతో నమ్మించి ఉద్యోగాలు పేరిట మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.1.5 కోట్లు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
Similar News
News January 13, 2026
చిత్తూరులో మహిళ మృతి

చిత్తూరులో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పట్టణంలోని పీసీఆర్ సర్కిల్లో 45 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న మహిళ మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులు విచారించగా రెండు రోజులుగా అదే ప్రాంతంలో ఆమె ఉన్నట్టు, ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసినవారు 08572 234100 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News January 13, 2026
ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా

TG: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా మంది కరెంట్ బిల్లులు చెల్లించట్లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘పాతబస్తీలో ప్రతిరోజు 20 లక్షల యూనిట్ల ఎలక్ట్రిసిటీని దొంగిలిస్తున్నారు. అంటే దాని విలువ ఏడాదికి రూ.500 కోట్లు. ఇది 2023 డేటా. ఇప్పుడు ప్రతి ఏడాది రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చు’ అని పాత వార్తలను షేర్ చేశారు.
News January 13, 2026
BREAKING: నల్గొండ జిల్లాలో విషాదం

నల్గొండ(D) మర్రిగూడ(M) చర్లగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన వెంకేపల్లిలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. SI కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దంపతులు గోగుల అంజయ్య, శారదకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అక్షయ్ కుమార్(10). కాగా ప్రాజెక్టు మట్టి కోసం తవ్విన గుంతలో అక్షయ్ ఈతకు వెళ్లి మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది.


