News April 19, 2025
KU డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III.V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
మేడ్చల్ జిల్లాలో వ్యవసాయమే జీవనాధారం..!

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగమే ప్రధాన జీవనాధారంగా సుమారు 40,872 మంది రైతులు, 19,000 మంది వ్యవసాయ కూలీలు జీవనం కొనసాగిస్తున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని.. రైతులు, కూలీలపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
News January 17, 2026
UPDATE: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి

పాఠశాల విధులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు టీచర్ల ప్రాణాలను బలిగొంది. నలుగురు ఉపాధ్యాయులు కలిసి కారులో తుంగతుర్తికి బయలుదేరారు. మార్గమధ్యంలో కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ఇసుక కుప్పపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తుంగతుర్తి KGBV ఎస్‌వో కల్పన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన రావులపల్లి HM గీతా రెడ్డిని HYDకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
News January 17, 2026
HYD: 10 నుంచి 12 జోన్లుగా HMDA విస్తరణ

HYD వేదికగా HMDA పునర్వ్యవస్థీకరణకు వేగం పెరిగింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. HMDA 10 నుంచి 12 జోన్లుగా విభజన చేసే అవకాశం ఉంది, ఈ మేరకు అదనపు అధికారులను నియమించనున్నారు. జోనల్ కార్యాలయాల పరిధిలో అనుమతులు ఇవ్వని అంశాలపై స్పష్టతనిస్తూ, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.


