News April 19, 2025

నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలి: మంత్రి

image

సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఉత్తమ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌‌తో కలిసి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.

Similar News

News April 20, 2025

BIG BREAKING: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ చేసుకోవాల్సిన సైట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 20, 2025

సిద్దిపేట: అగ్నివీర్‌ దరఖాస్తులు

image

యువకుల నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రాబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT

News April 20, 2025

నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఖమ్మం

image

ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజులు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

error: Content is protected !!