News March 28, 2024
నిజామాబాదీలు జర జాగ్రత్త..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రత 40 సెల్సియస్ డిగ్రీలు దాటుతోంది. నిన్న బుధవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని ముగ్పాల్ మండలం మంచిప్పలో 42.2, నిజామాబాద్ లో 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందలో 40.9, తాడ్వాయిలో 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.
Similar News
News September 8, 2025
NZB: బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్య

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లా సీనియర్ నేత బస్వా లక్ష్మీనర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటన విడుదల చేశారు. బస్వా లక్ష్మీనర్సయ్య గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, మెదక్ జిల్లా ప్రభారిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.
News September 8, 2025
నిజామబాద్: ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి ఫిర్యాదులను విని పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజావాణిలో మొత్తం 11 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.
News September 8, 2025
నిజామాబాద్: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

రాజీ మార్గమే ఉత్తమ మార్గమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ట్రాఫిక్, చిన్నపాటి క్రిమినల్, సివిల్ వివాదాల కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని సీపీ తెలిపారు. కేసుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.