News March 28, 2024

ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

ఎన్నికలు దగ్గర పడటంతో <>ఓటరు<<>> జాబితాలో తమ పేరు ఉందో? లేదో? తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం https://voters.eci.gov.in/ సైట్ ఓపెన్ చేసి Search in Electoral Rollపై క్లిక్ చేయాలి. అందులో EPIC/వివరాలు/ముబైల్ నంబర్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. VOTER HELPLINE అనే యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఓటు లేకపోతే BLO/తహశీల్దార్ కార్యాలయంలో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Similar News

News January 19, 2026

హర్షిత్ రాణాను చూసి NZ ప్లేయర్స్ వణికారు: క్రిస్ శ్రీకాంత్

image

NZతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయినప్పటికీ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా (52) తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. గతంలో ఆయన ఎంపికను విమర్శించిన మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఇప్పుడు హర్షిత్ ఆటతీరుకు ఫిదా అయ్యారు. ‘హర్షిత్ బ్యాటింగ్ చూస్తుంటే కివీస్ బౌలర్లు వణికిపోయారు. అతడు రియల్ గేమ్ ఛేంజర్’ అని ప్రశంసించారు. కోహ్లీ సెంచరీ వృథా అయినా.. హర్షిత్ పోరాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

News January 19, 2026

నితిన్ నబీన్ ఎంపిక వెనుక వ్యూహం ఇదేనా?

image

BJP జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నబీన్ ఎంపిక వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో యువ నాయకత్వానికి సంకేతం ఇవ్వడంతో పాటు యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాద రహితుడిగా, PM మోదీ, అమిత్ షాకు నమ్మకమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. నబీన్ అధ్యక్షతన 2029 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధం కానుంది.

News January 19, 2026

అగాథం నుంచి అగ్రస్థానానికి తెచ్చాం: CM

image

తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం అగాథంలో కూరుకుపోయిందని దావోస్ పర్యటనలో AP CM CBN అన్నారు. ‘రాష్ట్ర పరిస్థితిని చూసిన వారంతా దాన్ని బాగు చేయగలుగుతారా? అని సందేహించారు. అసాధ్యమనీ అన్నారు. దిగిన తర్వాత ఎంత అగాథంలోకి వెళ్లిందో అర్థమైంది. అలాంటి రాష్ట్రాన్ని18 నెలల్లో నంబర్ 1 బ్రాండ్‌గా తయారుచేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్‌లో వెళ్లాం. 25 కొత్త పాలసీలు తెచ్చాం’ అని తెలిపారు.