News March 28, 2024

HYD: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతవారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని సూచించింది. 

Similar News

News March 18, 2026

RR: వారికి డబుల్ బెడ్ రూమ్‌ రద్దు చేయండి: కలెక్టర్

image

లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్రూంలో నివసించకుంటే నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని RR కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో హౌసింగ్ బోర్డు అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.

News March 18, 2026

డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లలో ఉండాల్సిందే.. లేదంటే రద్దే

image

రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు ఈనెల 31లోపు నివాసం ఉండాలని, లేనిపక్షంలో కేటాయింపులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను ఏప్రిల్ మొదటి వారంలో కొత్తవారికి కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని RDO, MROలను కలెక్టర్ ఆదేశించారు.

News March 17, 2026

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత!

image

RR జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత కార్యక్రమం జరిగింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దంపతులు CARA పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి 3.5 ఏళ్ల తర్వాత పిల్లలను దత్తత తీసుకున్నారు. గత నెల రోజులుగా ఫాస్టర్ కేర్ కింద పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉండగా అనుబంధం సరిగ్గా ఉండడంతో కలెక్టర్ వద్ద ఫైనల్ దత్తత పత్రాలు అందుకున్నారని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు.