News April 20, 2025

తంగళ్ళపల్లి: వలకు చిక్కిన భారీ చేప

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన జాలరు గోలాడ నరేశ్‌కు వలలో 32.5 కిలోల భారీ బొచ్చ చేప చిక్కింది. రోజు లాగానే సిరిసిల్లలోని మిడ్ మానేరులో చేపలు పట్టడానికి వెళ్లగా వలలో భారీ చేప చిక్కిందని నరేశ్ తెలిపాడు. ఇంతవరకు ఎప్పుడూ ఇంత పెద్ద చేప ఎప్పుడు చిక్కలేదని, మొదటిసారిగా ఇంత పెద్ద చేపను పట్టుకున్నామని నరేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ భారీ చేపను చూడడానికి స్థానికులు ఆసక్తి చూపారు.

Similar News

News April 20, 2025

ఎమ్మెస్ రామారావును కడప జిల్లా వాసులు మరచిపోలేరు

image

ఎమ్మెస్ రామారావు నేపథ్య గాయకుడు మన మధ్య లేకపోయినా కడప జిల్లా వాసులు మరచిపోలేరు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కలదు, రామాయణ భాగం, సుందరకాండ, హనుమాన్ చాలీసా మంచి గుర్తింపు ఖ్యాతి తెచ్చి పెట్టాయి. గతంలో ఆకాశవాణి కడప రేడియో కేంద్రంలో ప్రతిరోజు ఉదయం పూట సుందరకాండ పారాయణం పాట ప్రసారం చేసేవారు. దానితో ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండేది. నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి. 

News April 20, 2025

వర్షం మొదలైంది..

image

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్‌పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News April 20, 2025

రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల 

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.

error: Content is protected !!