News April 20, 2025

కాంగ్రెస్‌ది చేతకాని పాలనకు నిదర్శనం: శ్రీనివాస్ గౌడ్

image

మద్యం ధరలను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పరిశ్రమలు ఏర్పాటుచేసి పెట్టుబడులు రాబట్టాలి గాని మద్యం రేట్లు పెంచి ఆదాయాన్ని అర్జించాలనే ప్రభుత్వ ధోరణి చేతకాని పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.

Similar News

News November 10, 2025

MBNR: సాఫ్ట్‌బాల్.. 2nd PLACE

image

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్‌లో మహబూబ్ నగర్ మహిళా సీనియర్ సాఫ్ట్ బాల్ జట్టు ద్వితీయ స్థానంలో(రజతం) నిలిచింది. తెలంగాణ సాఫ్ట్ బాల్ సెక్రటరీ శోభన్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరై జట్టును అభినందించారు. జగిత్యాలలోని ఈ నెల 7 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

News November 9, 2025

BREAKING.. MBNR: ట్రాక్టర్, ఆటో ఢీ.. మహిళ మృతి

image

మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి-మల్లాపూర్ రోడ్డులో ఆటోను పత్తి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో మల్లాపూర్‌కు చెందిన వడ్డే మల్లీశ్వరి (21) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి ఆరు నెలల వయసున్న కవల పిల్లలు (బాలుడు, బాలిక) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 9, 2025

MBNR: ఈనెల 12న అథ్లెటిక్స్ ఎంపికలు: శారదాబాయి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగాల్లో బాల, బాలికలకు అథ్లెటిక్స్ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. MBNRలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12న ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డులతో ఉదయం 9:00 గంటలలోపు పీడీ ఆనంద్ కుమార్‌కి రిపోర్ట్ చేయాలన్నారు.