News April 20, 2025
నారాయణపేట జిల్లాలో 6 తనిఖీ కేంద్రాల ఏర్పాటు

కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. జలాల్ పూర్, కాన్కూర్తి, చెగుంట, కృష్ణ నది బ్రిడ్జి, సమస్త పూర్, ఉజ్జెల్లి గ్రామాల వద్ద 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను 24 గంటలు పోలీసులు తనిఖీ చేస్తారని, రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో ఉంటారన్నారు.
Similar News
News April 20, 2025
జగిత్యాల: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ B.సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. భూభారతి అవగాహనా సదస్సులు జిల్లాలోని అన్ని మండలాలలో నిర్వహిస్తున్నందున అధికారులు భూ భారతి అవగాహన సదస్సుల్లో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
News April 20, 2025
IPL: ముగిసిన సీఎస్కే బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే..

MIvsCSK మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. దూబే(50), జడేజా (53*) రాణించారు. ధోనీ 4 పరుగులకే ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా 2, చాహర్, అశ్వని, శాంట్నర్ తలో వికెట్ తీసుకున్నారు. ముంబై విజయ లక్ష్యం 177 రన్స్.
News April 20, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూల్ జిల్లా TDP నాయకుడు సురేంద్ర మృతి
➤కర్నూలు: 3 శాతానికి పెరిగిన స్పోర్ట్స్ కోటా.!
➤రూపాయి నోటుపై సీఎం చంద్రబాబు చిత్రం
➤కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
➤కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
➤అనంత: బీటెక్ ఫలితాలు విడుదల
➤సురేంద్ర మృతి పార్టీకి తీరని లోటు: కర్నూలు MP
➤సీఎం బర్త్ డే.. ఎమ్మిగనూరులో 75 కేజీల కేక్ కటింగ్
➤కర్నూలు జిల్లాలో దంచికొట్టిన వర్షం