News April 20, 2025

అవిశ్వాసంతో పదవి కోల్పోయిన విశాఖ తొలి మేయర్ 

image

అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన మొదటి మేయర్‌గా హరివెంకట కుమారి నిలిచారు. విశాఖ మున్సిపాలిటీ 1979లో కార్పొరేషన్‌గా మారింది. 1981లో జరిగిన ఎన్నికల్లో మొదటి మేయర్‌గా N.S.N.రెడ్డి(1981-1986) గెలిచారు. అనంతరం 1987లో D.V సుబ్బారావు, 1995లో సబ్బం హరి, 2005లో రాజాన రమణి మేయర్లుగా పనిచేశారు. 2005లో G.V.M.C ఆవిర్భవించినాక 2007లో మేయర్‌గా జనార్దనరావు ఎన్నికయ్యారు.‌ 2021లో హరివెంకట కుమారి పదవి చేపట్టారు.

Similar News

News September 12, 2025

ఇప్పటి వరకు రూ.62.50లక్షలు ఇచ్చాం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం రూ.3లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్& రన్‌లో చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు,తీవ్ర గాయాలైన ఇద్దరికి రూ.50 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 77 మందికి రూ.62.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

News September 12, 2025

విశాఖలో V-PULL వ్యవస్థ బలోపేతం: జీవీఎంసీ కమిషనర్

image

జీవీఎంసీ బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్-2025లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 50 ఫైనలిస్ట్ నగరాల్లో ఒకటిగా నిలిచిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన V-PULL వ్యవస్థను బలోపేతం చేసి సంస్థాగతం చేయాలని గురువారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సూచించారు. ప్రజలు, నిపుణులు, సంస్థలు కలిసి కో-క్రియేషన్ పద్ధతిలో పట్టణ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని జీవీఎంసీ కమిషనర్ పిలుపునిచ్చారు.

News September 11, 2025

ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా రామకృష్ణ ప్రసాద్

image

ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీవో)గా రిటైర్డ్ ఎస్పీ కె.వి.రామకృష్ణ ప్రసాద్ గురువారం విశాఖలోని సమస్త ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై 31 వరకు ఆయన సీవీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన్ని మరో ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిలో సీవీవోగా ప్రభుత్వం నియమించింది. సంస్థ సీఎండీ పృథ్విరాజ్‌ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.