News March 28, 2024
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ.. అమెరికాలో కలకలం

అమెరికాలోని టెక్సస్, కాన్సాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని ఆవుల పాలల్లో బర్డ్ ఫ్లూ ఉందన్న విషయం బయటపడింది. ఇది పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ఆవులు H5N1 టైప్-A బారిన పడ్డాయని, జంతువుల్లో ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందడం ఇదే తొలిసారి అని వైద్య వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన ఆవుల్లో బద్ధకం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నాయి.
Similar News
News January 29, 2026
పాకిస్థాన్‌కు అంత దమ్ము లేదు: రహానే

T20 ప్రపంచ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరిస్తున్న పాకిస్థాన్‌పై భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆ జట్టుకు అంత దమ్ము లేదన్నారు. టోర్నీ ఆడేందుకు పాక్ వస్తుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ కోసం శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ <<18990370>>చేసుకున్నట్లు<<>> వార్తలు రావడం తెలిసిందే.
News January 29, 2026
ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు: ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే NDAనే గెలుస్తుందని Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. NDAకు 352 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ‘ఇండీ’ కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్‌కు 20 శాతం(80 సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.
News January 29, 2026
బార్ లైసెన్సులకు నోటిఫికేషన్

AP: బార్ లైసెన్సులకు ప్రభుత్వం రీనోటిఫికేషన్ జారీ చేసింది. 2025-28 బార్ పాలసీ కింద మిగిలిన 301 బార్ లైసెన్సులకు రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీ కింద నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీ 6 గంటల వరకు దరఖాస్తులను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో స్వీకరించనుంది. లక్కీ డిప్ పద్ధతిలో 5వ తేదీన లైసెన్సులు కేటాయించనుంది.


