News April 20, 2025
ప్రకాశం: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 24 రోజులు పెళ్లిళ్లకు మంచి గడియలు ఉన్నాయి. మండు వేసవి అయినప్పటికీ మంచిగడియల్లో పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో ప్రకాశం జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో కేవలం వివాహాల మీదనే రూ.30 కోట్ల వ్యాపారాలు జరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక కళ్యాణ మండపాలు, గోల్డ్, బట్టల షాపులు సందడిగా మారాయి.
Similar News
News September 11, 2025
ఒంగోలు: అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి 3 ఏళ్ల జైలుశిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. కొమరోలు మండలం మైనర్ బాలిక పట్ల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించారు. తాజాగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించగా పోలీసులను SP దామోదర్ అభినందించారు.
News September 10, 2025
రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రభావం ప్రకాశం జిల్లాపై సైతం పడుతుందని పేర్కొంది. దీంతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో నేటి సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి.
News September 10, 2025
ఆందోళన చెందవద్దని.. ప్రకాశం కలెక్టర్ పిలుపు!

రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం ముండ్లమూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో యూరియా సరఫరా, పంపిణీపై రైతులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో చేపట్టిన మెగా అవుట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.