News April 20, 2025

గుంటూరు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

image

గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన రెవెన్యూ వర్క్షాప్‌లో కలెక్టర్ నాగలక్ష్మి భూ సమస్యలపై కీలక సూచనలు చేశారు. ప్రజల నుంచి ఎక్కువగా భూ రికార్డుల, వెబ్‌ల్యాండ్ లోపాల, రీసర్వే అంశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను అధికారులు త్వరగా గుర్తించి పరిష్కరించకపోతే ప్రజలు విసుగుతో అధికార కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. అధికారుల సమన్వయం వల్లే సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయన్నారు.

Similar News

News July 7, 2025

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: DEO

image

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2025 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మండల, ఉప విద్యాశాఖ అధికారి ద్వారా ఈనెల 13వ తేదీలోగా http//nation-alawardstoteachers.education.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 7, 2025

ANMల బదిలీలలో చిక్కుముడులు.. మరోసారి కౌన్సెలింగ్

image

గుంటూరు జిల్లా వైద్య శాఖ ఇటీవల ANM గ్రేడ్-3గా ఉన్న సుమారు 200 మందికి పదోన్నతులు మంజూరు చేసి కొత్త నియామకాలు ఇచ్చింది. కానీ గత కౌన్సెలింగ్‌లో అదే పోస్టులు ఖాళీలుగా చూపటంతో పలువురు ఎంపిక చేసుకున్నారు. ఈ అంశం అధికారులు గుర్తించడంతో గత కౌన్సెలింగ్‌ను రద్దు చేసి సోమవారం మళ్లీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మీ తెలిపారు. ఈసారి ప్రక్రియ సునిశ్చితంగా, సీనియారిటీ ప్రాతిపదికన సాగనుంది.

News July 7, 2025

వికేంద్రీకరణ పద్ధతిలో PGRS అమలు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా అమలు కానుందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు సమీప మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ఇలా నిర్వహించడం వల్ల పాలన ప్రజలకు చేరువ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఫిర్యాది దారులు ఉపయోగించుకోవాలన్నారు.