News April 20, 2025

సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

image

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 9, 2026

పవన్ కళ్యాణ్‌ను కలిసిన కలెక్టర్, ఎస్పీ

image

కాకినాడ పర్యటనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్‌ను పోలీస్ గ్రౌండ్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందుమాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, శాంతిభద్రతల పరిరక్షణపై ఆయన అధికారులతో కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో పరిపాలన, భద్రత విషయంలో తాము తీసుకుంటున్న పలు కీలక చర్యలను అధికారులు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు వివరించారు.

News January 9, 2026

HNSS కల్యాణి డ్యామ్ అనుసంధానం పనులకు CM శంకుస్థాపన…?

image

<<18807676>>ఈ ప్రాజెక్టు<<>> ద్వారా ఏడాదికి 120 రోజుల పాటు సుమారు 432.32 MCFTల నీటిని తరలించడంతో పాటు, కళ్యాణి డ్యామ్‌లో 400 MCFTల నీటిని నిల్వ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో చంద్రగిరి(M)లోని 1,154 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు నీటి మట్టం పెరగనుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి రోజున CM చంద్రబాబు మూలపల్లి చెరువును పరిశీలించి, ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

News January 9, 2026

హైదరాబాద్‌లోని NIRDPRలో ఉద్యోగాలు

image

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR) 4 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. PG (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సోషల్ సైన్సెస్/ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్/ రూరల్ డెవలప్‌మెంట్/ మేనేజ్‌మెంట్/సోషల్ వర్క్), B.Tech/M.Tech/MCA అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 22వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: http://career.nirdpr.in//