News March 28, 2024

నెల్లూరు నగరంలో దారుణ హత్య

image

నెల్లూరు నగరంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. నగరంలోని వేణుగోపాల్‌ నగర్‌లో నాగూరు ఆదిశేషయ్య, మస్తానమ్మ కాపురం ఉంటున్నారు. వీరికి కుమారుడు వెంకటేశ్, కుమార్తెలు సునీత, దివ్య ఉన్నారు. సునీతకు సురేష్‌తో వివాహమయ్యింది. సునీతకు చంటి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో చంటి మస్తానమ్మను సునీత ఇంటికి తీసుకొచ్చాడు. వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు.. మస్తానమ్మను గొంతు కోసి హత్య చేశారు.

Similar News

News January 28, 2026

నెల్లూరు: వ్యవసాయ కూలీ బిడ్డ.. డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపిక!

image

కృషి, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడు రాపూరు మండలం గోనుపల్లికి చెందిన బొడ్డు రవి. మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో రవి డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపికయ్యారు. రైతు దంపతులు దశయ్య, రమాదేవిల కుమారుడైన రవి, ప్రస్తుతం ఏఎస్ పేటలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ​ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా, పనుల్లో తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూనే సొంతంగా చదివి ఈ విజయం సాధించడం విశేషం.

News January 28, 2026

నెల్లూరు: అంతా మహిళా బాస్‌లే..!

image

నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా నారీమణుల చేతుల్లోనే ఉంది. ఎస్పీ అజితా వెజెండ్ల నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్ష, గూడూరు డీఎస్పీ గీతా కుమారి వంటి ఐరన్ లేడీస్ పాలనా పగ్గాలు చేపట్టారు. ఉన్నతస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు మహిళా అధికారులే కీలక పోస్టింగ్‌లో ఉన్నారు. నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతూ.. బాధితులకు అమ్మలా అండగా నిలుస్తున్నారు

News January 28, 2026

నెల్లూరు: చిన్న గొడవలకే కత్తులు తీస్తున్నారు..!

image

నెల్లూరు జిల్లాలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. నేరగాళ్లలో మార్పు రావడం లేదు. నిరంతరం నిఘా ఉంచడం, కౌన్సెలింగ్ నిర్వహించడం, చివరికి నేరాలకు పాల్పడిన వారిని నడిరోడ్డుపై బేడీలతో నడిపిస్తున్నా రౌడీమూకల తీరు మారడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గొడవలు, వ్యక్తిగత విభేదాలకే కత్తులు దూస్తూ.. దాడులకు పాల్పడుతున్నారు.