News April 20, 2025

స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. విజయవాడ, ఖమ్మంలో స్కిన్‌లెస్ రూ.220 నుంచి రూ.230 వరకు పలుకుతోంది. గత వారం కిలో చికెన్ ధర రూ.260 వరకు అమ్మారు. అలాగే కరీంనగర్‌లో రూ.220-240 వరకు పలుకుతోంది. కాకినాడ, విశాఖపట్నంలోనూ రూ.220-240 వరకు ఉంది. చిత్తూరులో కిలో రూ.160-170గా ఉంది.

Similar News

News August 6, 2025

ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ అందుకే స్పందించట్లేదు: రాహుల్

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే <<17312842>>బెదిరింపులకు<<>> పాల్పడుతున్నా ప్రధాని మోదీ అడ్డుకోకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ Xలో విమర్శలకు దిగారు. అదానీ వ్యవహారంలో యూఎస్ దర్యాప్తు చేపట్టడమే మోదీ వైఖరికి కారణమన్నారు. రష్యాతో ఆయిల్ డీల్స్‌లో మోదీ, అదానీ-అంబానీ ఆర్థిక వ్యవహారాలను బయటపెట్టే ప్రమాదం ఉందనన్నారు. మోదీ చేతులు కట్టేశారని విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాలని రాసుకొచ్చారు.

News August 6, 2025

హీరోలకు రూ.100 కోట్లు.. మాకు వేతనాలు పెంచలేరా?: కార్మికులు

image

టాలీవుడ్‌లో నిర్మాతలకు, ఫెడరేషన్‌కు మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. సినిమాల్లో నటించే హీరోలకు రూ.100 కోట్లు ఇస్తున్నారని, తమకు వేతనాలు పెంచితే నష్టమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ వాళ్లకు నెలకు జీతం వస్తుందని, తమకు నెలలో సగం రోజులే పని దొరుకుతుందని చెబుతున్నారు. ముంబై టెక్నీషియన్లను తీసుకొచ్చేందుకు పెట్టే ఖర్చులో కనీసం సగం తమకు ఇచ్చినా తమ బతుకులు మారతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News August 6, 2025

ఎవరు లోకల్? ఎవరు నాన్ లోకల్?

image

TG: MBBS సీట్ల భర్తీలో స్థానిక కోటాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడే పుట్టి, టెన్త్ వరకు ఇక్కడే చదివి ఇంటర్ వేరే ప్రాంతంలో చదివిన వారిని లోకల్ కోటాలో పరిగణించడం లేదు. దీంతో సీటు పొందడానికి ఎవరు లోకల్? ఎవరు కాదనే చర్చ మొదలైంది. గత నిబంధనలతో రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం <<17317107>>GO 33 పేరుతో<<>> స్థానికతపై కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. దీంతో ఈ వివాదం మొదలవగా, సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.