News April 20, 2025
రాజంపేట: ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి

రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గుడి తండాకి చెందిన మాలోత్ అనిత, గణేశ్‌ల చిన్న కుమారుడు చిన్నా శనివారం సాయంత్రం ఇంటి ముందు స్నేహితులతో కలసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాక్టర్ గేర్లను మార్చగా న్యూట్రల్‌లోకి వెళ్లింది. వెనక పల్లంగా ఉండటంతో ట్రాక్టర్ టైర్ చిన్నాపై నుంచి వెళ్లింది. గాయపడిన చిన్నాను కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News April 20, 2025
బోధన్ డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదంపై సబ్ కలెక్టర్ ఆరా

బోధన్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. మంటలను అదుపు చేసి, వీలైనంత త్వరగా ఆర్పడానికి తక్షణ అవసరమైన చర్యలు, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్‌తో వెంకట నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
News April 20, 2025
NZB: రేపు ప్రజావాణి రద్దు

ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి రద్దయ్యింది. సోమవారం జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవం ఉన్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి తిరిగి యథావిధిగా ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు.
News April 20, 2025
పోతంగల్: కొడుకు పెళ్లి.. తండ్రి మృతి

తెల్లవారితే కొడుకు పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. రుద్రూర్‌కు చెందిన నాగయ్య(52) తన కొడుకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే శనివారం పోతంగల్‌లోని కారేగాంకు బైక్ పై వెళుతుండగా హంగర్గ ఫారం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టాడు. అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.