News April 20, 2025
డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడదాం: చిరంజీవి

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని టీవర్క్స్‌లో జరిగిన నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరం చేయిచేయీ కలుపుదాం. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా శ్రమించాలి. వ్యసనాలకు బానిసలై తమ కలలను దూరం చేసుకుంటున్న యువతను రక్షిద్దాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News August 6, 2025
ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ అందుకే స్పందించట్లేదు: రాహుల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే <<17312842>>బెదిరింపులకు<<>> పాల్పడుతున్నా ప్రధాని మోదీ అడ్డుకోకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ Xలో విమర్శలకు దిగారు. అదానీ వ్యవహారంలో యూఎస్ దర్యాప్తు చేపట్టడమే మోదీ వైఖరికి కారణమన్నారు. రష్యాతో ఆయిల్ డీల్స్‌లో మోదీ, అదానీ-అంబానీ ఆర్థిక వ్యవహారాలను బయటపెట్టే ప్రమాదం ఉందనన్నారు. మోదీ చేతులు కట్టేశారని విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాలని రాసుకొచ్చారు.
News August 6, 2025
హీరోలకు రూ.100 కోట్లు.. మాకు వేతనాలు పెంచలేరా?: కార్మికులు

టాలీవుడ్‌లో నిర్మాతలకు, ఫెడరేషన్‌కు మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. సినిమాల్లో నటించే హీరోలకు రూ.100 కోట్లు ఇస్తున్నారని, తమకు వేతనాలు పెంచితే నష్టమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ వాళ్లకు నెలకు జీతం వస్తుందని, తమకు నెలలో సగం రోజులే పని దొరుకుతుందని చెబుతున్నారు. ముంబై టెక్నీషియన్లను తీసుకొచ్చేందుకు పెట్టే ఖర్చులో కనీసం సగం తమకు ఇచ్చినా తమ బతుకులు మారతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News August 6, 2025
ఎవరు లోకల్? ఎవరు నాన్ లోకల్?

TG: MBBS సీట్ల భర్తీలో స్థానిక కోటాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడే పుట్టి, టెన్త్ వరకు ఇక్కడే చదివి ఇంటర్ వేరే ప్రాంతంలో చదివిన వారిని లోకల్ కోటాలో పరిగణించడం లేదు. దీంతో సీటు పొందడానికి ఎవరు లోకల్? ఎవరు కాదనే చర్చ మొదలైంది. గత నిబంధనలతో రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం <<17317107>>GO 33 పేరుతో<<>> స్థానికతపై కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. దీంతో ఈ వివాదం మొదలవగా, సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.