News April 20, 2025
ప్రకాశం: భార్యను హతమార్చిన భర్త

ఉమ్మడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 16, 2026
ప్రకాశం జిల్లాలో విషాదం.. తల్లీబిడ్డ మృతి

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలో మరో ప్రమాదం జరిగింది. పిచికల గుడిపాడుకు చెందిన వెంకటసుబ్బయ్య(55) తన తల్లి మహాలక్ష్మమ్మ(75)తో కలిసి బైకుపై అద్దంకి బయల్దేరారు. గుడిపాడు సమీపంలోనే వీరిని కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ వైద్యశాలకు తరలించారు. అప్పటికే వారిద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. ఇదే మండలంలో ఉదయం కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో టీడీపీ నేత <<18871250>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే.
News January 16, 2026
ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతిచెందాడు. నెల్లూరుకు చెందిన మైనార్టీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జాఫర్ షరీఫ్(54) కారులో విజయవాడ నుంచి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. జాఫర్ షరీఫ్‌ను ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.
News January 15, 2026
ప్రకాశం: ట్రాక్టర్ రివర్స్ పోటీలు

దర్శి మండలం రాజంపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతి వంటి పండుగలు గ్రామీణ క్రీడలను, రైతు సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, ఇలాంటి వినూత్న పోటీలు యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.


