News April 20, 2025

ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్: డీఈఓ

image

నల్లచెరువు అంబేడ్కర్ ఎయిడెడ్ పాఠశాలలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను డీఈఓ సీవీ రేణుక సస్పెండ్ చేశారు. హాజరు తప్పుగా చూపడం, మధ్యాహ్న భోజన లబ్దిదారుల సంఖ్యను పెంచడం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై జాకీర్ హుస్సేన్, డి. రవిపై చర్యలు తీసుకున్నారు. డీఈఓ తనిఖీలో 46 మందికి హాజరు వేసినా, కేవలం 9 మంది విద్యార్థులే ఉండటం గమనార్హం.

Similar News

News July 6, 2025

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడండి: ఎస్పీ

image

గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్వోబీ పనులు జరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపులను ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండే రహదారులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపులు వద్ద తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించి సమన్వయం చేసుకోవాలన్నారు. సమాచార వ్యవస్థతో ప్రణాళిక బద్దంగా ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

News July 6, 2025

తెనాలి: టెలిగ్రామ్ యూజర్లకు డీఎస్పీ జనార్ధనరావు హెచ్చరిక

image

వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ‘apk’ ఫైల్స్, ప్రభుత్వ అధికారుల గ్రూపుల్లో చేరమంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. వీటిని డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ నేరగాళ్ల వశమై, యాప్‌ల నుంచి నగదు తస్కరిస్తారని హెచ్చరించారు. మీ స్నేహితులకు మీ తరఫున మెసేజ్‌లు పంపి ఫోన్‌ను హ్యాక్ చేస్తారని తెలిపారు.

News July 6, 2025

గుంటూరు: లోక్ అదాలత్‌లో 10,698 కేసులు పరిష్కారం

image

గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ సాధ్యమైన కేసులను పరిష్కరించారు. వాటిలో సివిల్‌ కేసులు 1,041, క్రిమినల్‌ 9,580, ప్రీలిటిగేషన్‌ 77, మొత్తం 10,698 కేసులు ఉన్నాయి. పరిష్కరించిన కేసుల విలువ మొత్తం రూ.50.96 కోట్లు ఉందని జడ్జి చక్రవర్తి తెలిపారు.