News April 20, 2025

సంగారెడ్డి: అగ్నివీర్‌ దరఖాస్తుల ఆహ్వానం

image

యువకుల నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రాబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు. SHARE IT..

Similar News

News April 20, 2025

ఎంఐఎం నేతలు విషసర్పాల కంటే ప్రమాదం: బండి

image

TG: వక్ఫ్ ఆస్తులను దోచుకున్న దొంగలంతా నిన్న హైదరాబాద్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎంఐఎం పార్టీ నేతలు విష సర్పాల కంటే ప్రమాదమని మండిపడ్డారు. ఒవైసీ మీటింగ్‌కు స్పాన్సర్ రేవంత్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయన్నారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

News April 20, 2025

సఖినేటిపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం రోడ్డులో రాంబాగ్ దాటిన తరువాత IPC చర్చి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న నిమ్మకాయల వ్యాపారి బొనం బాపిరాజు (35) కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2025

జేఈఈలో 299వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ

image

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్‌కు చెందిన అచ్చిన రాకేశ్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 299వ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. దీంతో రాకేశ్‌కు గ్రామస్థులతో పాటు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.

error: Content is protected !!