News April 20, 2025
రేపు వనపర్తిలో ప్రజావాణి రద్దు

ఈనెల 26వ తేదీ వరకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమం ఉంటాయని వనపర్తి కలెక్టర్ ఆదర్స్ సురభి తెలిపారు. ఈ విషయమై రేపు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఇది గమనించాలని సహకరించాలని కోరారు.
Similar News
News April 20, 2025
విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖ నగర ప్రజలు లా అండ్ ఆర్డర్,క్రైమ్, దొంగతనాలు, ట్రాఫిక్ సమస్యలు,పలు పోలీస్ సంబంధిత సమస్యలపై రేపు ఉదయం 10 గంటల నుంచి వినతులు సమర్పించవచ్చన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అయితే అంబేడ్కర్ జయంతి కారణంగా గత సోమవారం పీజిఆర్ఎస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
News April 20, 2025
ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.
News April 20, 2025
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.