News April 20, 2025
కాబోయే భార్య వేధింపులు.. అధికారి సూసైడ్

కాబోయే భార్య వేధింపులు తాళలేక ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్న ఘటన MHలో జరిగింది. నాసిక్‌కు చెందిన హరేరామ్(36), వారణాసి యువతి మోహినికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసి హరేరామ్ నిలదీశాడు. విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బెదిరించింది. మానసిక ఒత్తిడికి లోనైన హరేరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి, ఆమె లవర్‌పై కేసు నమోదైంది.
Similar News
News January 26, 2026
కొండెక్కిన వెండి ధర.. ఔన్స్‌కు $110!

అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ <<18959429>>ఉదయం<<>> ఔన్స్‌కు $100 వద్ద ఉన్న ధర ప్రస్తుతం $110కి చేరింది. కేవలం నెల రోజుల్లోనే 54% పెరుగుదల నమోదు కాగా జనవరి 2025తో పోలిస్తే ఏకంగా 280% పెరిగిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.
News January 26, 2026
PHOTO GALLERY: అమరావతిలో రిపబ్లిక్ డే

AP: రాజధాని అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్‌లో తొలిసారి నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసుల కవాతు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్వర్ణ పంచాయతీ- స్వచ్ఛ పంచాయతీ, స్వచ్ఛాంధ్ర, పర్యాటక, ఉద్యానవన శాఖ, అమరావతి, ఐటీ శకటాలు అబ్బురపరిచాయి.
News January 26, 2026
గోవిందాపై భార్య సునీత సంచలన కామెంట్స్

స్టార్ హీరో గోవిందాపై భార్య సునీతా అహుజా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన అఫైర్స్ రూమర్స్‌ను పరోక్షంగా కన్ఫర్మ్ చేసిన ఆమె 63 ఏళ్ల వయసులో ఇలాంటివి తగదని సూచించారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారని.. వాళ్లు డిస్టర్బ్ అవుతారన్నారు. ‘హీరోయిన్ అవ్వలేని కొంతమంది అమ్మాయిలు స్టార్లను ట్రాప్ చేసి తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తారు. మరి మీ బుద్ధి ఏమైంది’ అంటూ గోవిందా పేరు ఎత్తకుండా ఆయన్ని ప్రశ్నించారు.


