News April 20, 2025
రెండో పెళ్లికి సమంత సిద్ధం?

హీరోయిన్ సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో కలిసి నిన్న ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, మే నెలలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటు సమంతగానీ, అటు రాజ్‌గానీ స్పందించలేదు.
Similar News
News November 17, 2025
వాట్సాప్‌లోనే ‘మీ సేవ’లు!

TG: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పదేపదే మీ-సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్ ద్వారానే అందించనుంది. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందిందా? లేదా? అప్రూవ్ అయితే సర్టిఫికెట్‌ను వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు ఈ సేవలను లాంచ్ చేయనున్నారు.

రాష్ట్రపతికి 16వ ఆర్థిక సంఘం నివేదిక

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు 16వ ఆర్థిక సంఘం తన నివేదికను అందించింది. నికర పన్ను ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు మధ్య పంపిణీ వాటాలు, ఇతర అంశాలపై ఈ సంఘం సిఫార్సులు చేస్తుంటుంది. సంఘం సిఫార్సులను ఆర్థిక శాఖ పరిశీలించి బడ్జెట్లో ప్రవేశపెడుతుంది. 2026 ఏప్రిల్1 నుంచి 5 ఏళ్లపాటు ఈ సంఘం సిఫార్సులు అమలవుతాయి. కాగా 15వ ఆర్థిక సంఘం పన్ను ఆదాయంలో 41% STATESకు కేటాయించేలా సిఫార్సు చేసింది.