News April 20, 2025

చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన KCR

image

ఏపీ సీఎం చంద్రబాబుకు KCR జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు BRS ట్వీట్ చేసింది. ‘నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని KCR ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కేసీఆర్ కోరుకున్నారు’ అని పేర్కొంది. అటు విజయసాయిరెడ్డి కూడా CBNకు విషెస్ చెప్పారు.

Similar News

News January 8, 2026

ఒత్తిడి పెరిగితే అందం తగ్గిపోతుంది

image

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.

News January 8, 2026

వాట్సాప్ కొత్త ఫీచర్లు: మెంబర్ ట్యాగ్స్, టెక్స్ట్ స్టిక్కర్స్

image

వాట్సాప్ మరో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇకపై గ్రూప్ చాట్స్‌లో ఎవరి పాత్ర ఏంటో తెలిపేలా ‘మెంబర్ ట్యాగ్స్’ సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక గ్రూప్‌లో ‘కెప్టెన్’ అని, మరో గ్రూప్‌లో ‘అమ్మ’ అని ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఏ పదాన్నైనా తక్షణమే స్టిక్కర్‌గా మార్చే ‘టెక్స్ట్ స్టిక్కర్స్’, ముఖ్యమైన మీటింగ్స్ లేదా పార్టీలను గుర్తు చేసేలా ‘ఈవెంట్ రిమైండర్స్’ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

News January 8, 2026

రప్పా రప్పా టీడీపీ విధానం కాదు: లోకేశ్

image

AP: YCP కుట్రలు, అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఆ పార్టీ మాదిరిగా రప్పా రప్పా TDP విధానం కాదని మంత్రులతో నిర్వహించిన అల్పాహార విందు భేటీలో చెప్పారు. దౌర్జన్యాలు, బెదిరించడం TDP సంస్కృతి కాదని అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ వారికి ఎంత సేవ చేశామనేదే మన అజెండా కావాలని పేర్కొన్నారు. ప్రజావేదికలో వచ్చే అర్జీల పరిష్కారానికి మంత్రులు చొరవచూపాలని కోరారు.