News March 28, 2024

తిరగబెడుతున్న రొమ్ము క్యాన్సర్.. కారణమిదే!

image

మహిళల్లో ఎక్కువగా వచ్చే రొమ్ము క్యానర్స్‌ ‘ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్’. అయితే చికిత్స తర్వాత కూడా కొందరిలో మళ్లీ ఈ క్యాన్సర్ తిరగబెడుతోంది. చికిత్స సమయంలో క్యాన్సర్ కణాలు స్లీపింగ్‌ మోడ్‌లోకి వెళ్లి కొన్నాళ్లకు తిరిగి క్రియాశీలం అవ్వడమే దీనికి కారణమని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. G9a అనే ఎంజైమ్ వల్లే ఇలా జరుగుతోందని.. దీనిని నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Similar News

News October 4, 2024

సెకండ్ రిలీజ్‌లో ‘తుంబాడ్’ సంచలనం

image

సూపర్‌ నేచురల్ కథాంశాన్ని సస్పెన్స్‌తో ముడిపెట్టి రూపొందించిన ‘తుంబాడ్’ సినిమా రీ-రిలీజ్‌లో దుమ్మురేపుతోంది. ఆరేళ్ల క్రితం తొలి రిలీజ్‌లో దేశవ్యాప్తంగా కేవలం రూ.12.30 కోట్లే కలెక్ట్ చేసిన ఈ మూవీ, సెకండ్ రిలీజ్‌లో ఇప్పటి వరకు ఏకంగా రూ.30 కోట్లు వసూలు చేసింది. దసరా సెలవులు వచ్చిన నేపథ్యంలో రూ.50 కోట్ల మార్కు దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

News October 4, 2024

వయసు తగ్గిస్తామని రూ.35కోట్లు నొక్కేశారు

image

UPలోని కాన్పూర్‌లో రష్మీ, రాజీవ్ దూబే జంట ‘రివైవల్ వరల్డ్’ పేరుతో ఓ థెరపీ సెంటర్‌ను నెలకొల్పింది. ఇజ్రాయెల్‌ టైమ్ మెషీన్‌తో ఆక్సిజన్ థెరపీ చేసి వృద్ధులను 25ఏళ్ల వారిగా మారుస్తామంటూ నమ్మించింది. ఒక్కో సెషన్‌కు వారి నుంచి రూ.90వేలు రాబట్టింది. అలా దాదాపు పాతిక మందిని మోసం చేసి వారి నుంచి రూ.35కోట్లు వసూలు చేసింది. మోసాన్ని గుర్తించిన ఓ కస్టమర్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

News October 4, 2024

ఎల్లుండి ఇండియాకు రానున్న మయిజ్జు

image

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ఈ నెల 6న భారత్ రానున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు ఇక్కడ పర్యటిస్తారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కూడా సమావేశం అవుతారు. ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరులో మయిజ్జు పర్యటిస్తారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయిజ్జు భారత పర్యటనకు వస్తుండడం విశేషం.