News April 20, 2025
తొలి మహిళా కమాండో బృందం ‘టీం శివంగి’ ఏర్పాటు

TG: నిర్మల్ జిల్లాలో తొలి మహిళా కమాండో బృందం ‘టీం శివంగి’ ఏర్పాటైంది. ఈ బృందాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘టీం శివంగి’ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మహిళా పోలీసులలోని ఔత్సాహికులకు 45 రోజుల కఠిన శిక్షణ ఇచ్చి కమాండో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయుధాలు, సాంకేతిక, తదితర అంశాలపై వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News August 5, 2025
BREAKING: సీజ్‌ఫైర్ ఉల్లంఘించిన పాక్

పాక్ ఆర్మీ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ సమీపంలో కాల్పులకు తెగబడింది. ఇండియన్ ఆర్మీ శత్రువులకు దీటుగా బదులిచ్చింది. సుమారు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ కాల్పులు జరపడం ఇదే తొలిసారి.
News August 5, 2025
డా.నమ్రత కేసులో సంచలన విషయాలు

TG: ‘సృష్టి’ ఫేక్ సరోగసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాలపై పోలీసులు ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో డా.నమ్రతకు సంబంధాలున్నట్లు గుర్తించారు. ఏజెంట్ల సాయంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేల్చారు. అస్సాం, బిహార్, ముంబై, రాజస్థాన్ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులు చేశామని నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
News August 5, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని సూచించింది.