News April 20, 2025

జగిత్యాల: నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్ శ్యామల

image

జగిత్యాల వాసి గుగ్గిల మనోజ్ఞ నిర్మల్ డిపో బస్సు TS18T 4456లో పర్సును సీటుపై మర్చిపోయారు. డిపోలో బస్సును అప్పగించేటప్పుడు కండక్టర్ శ్యామలకు పర్సు కనబడింది. వెంటనే పర్సును డిపో క్లర్క్‌కు అప్పగించారు. అందులో రూ.2వేల నగదు, చెవి కమ్మలు ఉన్నాయి. ప్రయాణికురాలిని డిపోనకు పిలిపించి క్లర్క్ ఎన్.ఆర్ శేఖర్ అప్పజెప్పారు. కండక్టర్ శ్యామలను అభినందించారు.

Similar News

News January 7, 2026

పసుపు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

image

పసుపు రకాన్ని బట్టి పంట కాలం 7 నుంచి 9 నెలలుగా ఉంటుంది. పసుపు పంట పక్వానికి వచ్చిన తర్వాతే కోత కోయడం ప్రారంభించాలి. పక్వానికి రాకముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు, కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. మొక్కల ఆకులు పాలిపోయి, తర్వాత ఎండిపోయి నేలపై పడిపోతే పంట కాలం పూర్తి అయ్యిందని గుర్తించవచ్చు. ఈ దశలో దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి.

News January 7, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,110
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.12,981
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.

News January 7, 2026

తూర్పు గోదావరి జిల్లాలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

AP: రాజమహేంద్రవరంలోని GMC, GGHలో 60పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా( అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్& ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ECG), బీఎస్సీ, DMLT, BSc(MLT), ఇంటర్(ఒకేషనల్), CLISc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in