News April 20, 2025

గుజరాత్‌లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ

image

AP: మంత్రి నారాయణ బృందం ఇవాళ అహ్మదాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ఏక్తానగర్‌కు మంత్రి బస్సులో ప్రయాణించారు. ఏక్తానగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలు అక్కడి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో భారీ విగ్రహాల నిర్మాణం కోసం పటేల్ విగ్రహ నిర్మాణ తీరును మంత్రి బృందం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News August 5, 2025

BREAKING: సీజ్‌ఫైర్ ఉల్లంఘించిన పాక్

image

పాక్ ఆర్మీ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తూ జమ్మూ‌కశ్మీర్‌‌లోని పూంఛ్ సమీపంలో కాల్పులకు తెగబడింది. ఇండియన్ ఆర్మీ శత్రువులకు దీటుగా బదులిచ్చింది. సుమారు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ కాల్పులు జరపడం ఇదే తొలిసారి.

News August 5, 2025

డా.నమ్రత కేసులో సంచలన విషయాలు

image

TG: ‘సృష్టి’ ఫేక్ సరోగసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాలపై పోలీసులు ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో డా.నమ్రతకు సంబంధాలున్నట్లు గుర్తించారు. ఏజెంట్ల సాయంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేల్చారు. అస్సాం, బిహార్, ముంబై, రాజస్థాన్ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులు చేశామని నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

News August 5, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని సూచించింది.