News March 28, 2024
వేడెక్కిన మెదక్ లోక్‌సభ రాజకీయం

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురువైంది. ఇరు పార్టీలనేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ BRS నేతలు సెటైర్లు వేశారు.
Similar News
News March 19, 2026
మెదక్: 61 మందితో డీసీసీ కార్యవర్గం ఏర్పాటు

61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇందులో ఉపాధ్యక్షులుగా 14 మంది, ప్రధాన కార్యదర్శులుగా 20 మంది, కార్యదర్శులుగా 20 మంది, అధికార ప్రతినిధులకు ఆరుగురు, ఒక కోశాధికారిని నియమించారు. మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కె.హరిత ఉపాధ్యక్షులుగా, తోడుపునూరి శివరామకృష్ణ కోశాధికారిగా నియమింపబడ్డారు.
News March 19, 2026
61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ప్రకటించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా జిల్లా కమిటీని విస్తరించారు. జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను మొత్తం 61 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీని విస్తరించినట్లు తెలిపారు.
News March 19, 2026
మెదక్: విషాదం.. వ్యక్తి సూసైడ్

నిజాంపేట మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పంజా సత్తయ్య(46) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మించడంతో అప్పులు పెరిగి, తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


