News April 20, 2025
కొత్త ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్!

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమెంట్ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై సిమెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కంపెనీలతో ఒప్పందం కుదిరిన తర్వాత మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువ ధరకే లబ్ధిదారులకు సిమెంట్ అందజేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే.
Similar News
News August 5, 2025
AP న్యూస్ రౌండప్

*ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి CM చంద్రబాబు, లోకేశ్‌కు ఆహ్వానం
*అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్-2025 పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
*హ్యాండ్లూమ్ వస్త్రాలపై GST భరిస్తాం: CBN
*వైనాట్ 175లాంటిదే.. జగన్ 2.0 కూడా: నిమ్మల
*మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ACB కోర్టు తీర్పు రిజర్వ్
*2020లో గుడివాడ ఏరియా ఆస్పత్రి అవకతవకలపై 11మంది వైద్యులు, నర్సులపై విచారణకు మంత్రి సత్యకుమార్ ఆదేశం
News August 5, 2025
BREAKING: సీజ్‌ఫైర్ ఉల్లంఘించిన పాక్

పాక్ ఆర్మీ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ సమీపంలో కాల్పులకు తెగబడింది. ఇండియన్ ఆర్మీ శత్రువులకు దీటుగా బదులిచ్చింది. సుమారు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ కాల్పులు జరపడం ఇదే తొలిసారి.
News August 5, 2025
డా.నమ్రత కేసులో సంచలన విషయాలు

TG: ‘సృష్టి’ ఫేక్ సరోగసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ మోసాలపై పోలీసులు ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో డా.నమ్రతకు సంబంధాలున్నట్లు గుర్తించారు. ఏజెంట్ల సాయంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేల్చారు. అస్సాం, బిహార్, ముంబై, రాజస్థాన్ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులు చేశామని నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.