News April 20, 2025

కొమురవెల్లి మల్లికార్జునుడిని దర్శించుకున్న బక్కి వెంకటయ్య

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభీక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

Similar News

News January 1, 2026

VJA: అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు సిట్టింగ్ జడ్జి

image

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ టి.సి.డి. శేఖర్ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

News January 1, 2026

ఎర్రవల్లి ఫామ్ హౌస్, నందినగర్ నివాసానికి లేఖలు

image

సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ బాధితులు మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖలు పంపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్, నందినగర్ నివాసాలకు స్పీడ్ పోస్ట్ ద్వారా వీటిని పంపారు. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తమ భూమి, నివాస, పునరావాస సమస్యలపై చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ గోడును సభ దృష్టికి తీసుకెళ్లాలని బాధితులు కోరారు.

News January 1, 2026

భద్రకాళి క్షేత్రంలో ఆధ్యాత్మిక వెల్లువ.!

image

భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కొత్త ఏడాదిని ప్రారంభించేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలవబడే భద్రకాళి అమ్మవారికి అర్చకులు నిర్వహించిన ప్రత్యేక అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.