News March 28, 2024

HYD: మామిడి పండ్లు కొంటున్నారా..? జాగ్రత్త!

image

HYD నగరంలో వేసవి వేళ మామిడి పండ్ల క్రయ విక్రయాలు పెరిగాయి. ఇదే అదునుగా వ్యాపారులు మామిడికాయ త్వరితగతిన పక్వానికి రావడానికి కెమికల్ ప్యాకెట్లను కాయల మధ్య ఉంచుతున్నారు. ఇలా చేసి పండించిన పండ్లను తినడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శివలీల తెలిపారు. కాగా ఇటీవలే బాటసింగారంలో వేలాది పండ్లను సీజ్ చేశారు. మామిడి పండ్లు కొనేటప్పుడు జర జాగ్రత్త..!

Similar News

News March 23, 2026

ఇక పార్కుల్లోనే.. HYDలో కొత్త ట్రెండ్

image

ఏంది భయ్యా.. ఇంకా ఆ AC రూముల్లో వెయిట్లెత్తుతున్నారా? అది పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు సిటీ కుర్రాళ్ల ట్రెండే వేరు. జిం ఫీజులు కట్టడం మానేసి.. పబ్లిక్ పార్కుల్లో ఇనుప రాడ్లు పట్టుకొని విన్యాసాలు చేస్తున్నారు. దీని పేరే ‘కాలిస్థెనిక్స్’. మజిల్స్ పెంచడం కాదు.. బాడీని గాల్లో తేల్చడమే అసలైన కిక్కంటున్నారు. KBR పార్క్ నుంచి గచ్చిబౌలి దాకా ఎక్కడ చూసినా ఈ బాడీ వెయిట్ బాపతే. ఈ సమ్మర్‌కి ఇదే అసలైన వైబ్ మరి.

News March 23, 2026

నేను CM అయితా.. సినిమాలో: మల్లారెడ్డి

image

రేవంత్‌ని CM చేసింది తానేనని, రెడ్డి సామాజికవర్గంలో అత్యంత పవర్‌ఫుల్ నాయకుడు అతనే అని అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. తామిద్దరం అన్నదమ్ములం అని పేర్కొన్న మల్లారెడ్డి తన సినీ ఆశక్తులను కూడా పంచుకొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీశ్ శంకర్ అడిగినా ఒప్పుకోలేదు. సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉంది’ అని మల్లన్న మనసులో మాట చెప్పుకొచ్చారు.

News March 23, 2026

HYD: రియల్ ఎస్టేట్‌పై మూసీ బ్యూటిఫికేషన్‌ ఎఫెక్ట్..!

image

మూసీ సుందరీకరణ పేరుతో సర్కార్ నిర్ణయాలు రియల్ ఎస్టేట్‌ను వణికిస్తున్నాయి. సుమారు 1200 సర్వే నంబర్లు ధరణి పోర్టల్‌లో సైలెంట్‌గా బ్లాక్ చేసేశారని సమాచారం. ఇందులో దాదాపు 450వరకు భారీ వెంచర్లు, విల్లా ప్రాజెక్టులు ఉండటం గమనార్హం. FTL, బఫర్ జోన్ల సాకుతో సబ్-రిజిస్ట్రార్లకు అంతర్గత ఆదేశాలు జారీ కావడంతో రిజిస్ట్రేషన్లు ఆగాయి. ప్రభుత్వం అండర్ గ్రౌండ్ ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.