News March 28, 2024
ఏలూరు జిల్లాలో బీఎస్పీ అభ్యర్థులు జాబితా

ఏలూరు జిల్లాలో బీఎస్పీ పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆచార్య ఎన్‌ఏడీ పాల్, ఏలూరు అసెంబ్లీకి అందుగుల రతన్‌కాంత్, చింతలపూడి- ఎల్.చైతన్య, దెందులూరు – నేత రమేశ్ బాబు, ఉంగుటూరు- బుంగా ఏసు, కైకలూరు- మన్నేపల్లి నాగేశ్వరరావు, నూజివీడు – డాక్టర్ చెలిగంటి వెంకటేశ్వరరావు, పోలవరం – సరయం వెంకటేశ్వరరావులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 19, 2025
కొల్లేరు సరిహద్దులు గుర్తింపు.. వారందరిలో ఆందోళన

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయి నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం ఏం చేయబోతుందన్నదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
News March 19, 2025
ప.గో : అమ్మకు చీర కొనడానికి దొంగతనం.. చివరికి

ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన సురేందర్ తెలంగాణలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పోలీసులు మంగళవారం సురేందర్ నేరాలను వివరించారు. 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దొంగతనం చేసినట్లు వెల్లడించారు. మొదటిసారి అమ్మకు చీర కొనడానికి రూ.300 దొంగతనం చేశాడన్నారు. అతడి వద్ద రూ. 45 లక్షల సొత్తు రికవరీ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.
News March 19, 2025
ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.