News April 21, 2025
సమస్యలు ఉంటే తెలపండి: కడప కలెక్టర్

రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కానీ వాటిపై నేరుగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దీంతో పాటు డయల్ యువర్ కలెక్టర్ ద్వారా 08562-244437 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలపవచ్చన్నారు.
Similar News
News September 10, 2025
కడప: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

కడప తాలూకా స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు రాజ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప, SI తులసినాగ ప్రసాద్ తెలిపారు. భగత్ సింగ్ నగర్‌కు చెందిన రాజ్ కుమార్ అనే రౌడీషీటర్ అయిదేళ్ల చిన్నారిపై ఈనెల 7వ తేదీన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి అతన్ని పట్టుకుని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News September 10, 2025
వారం రోజుల్లో 50 వేల టన్నుల యూరియా రానుంది: కలెక్టర్ శ్రీధర్

వారం రోజుల్లో 50 వేల టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం యూరియా డిమాండ్, నిల్వలు, సరఫరాపై జేసీ అదితి సింగ్, ఎస్పీ అశోక్ కుమార్‌లతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటికే 12,800 మెట్రిక్ టన్నుల యూరియాను ఆయా ప్రాంతాల రైతు సేవా కేంద్రాలు, సంబంధిత డీలర్ల ద్వారా అందించామన్నారు. సరిపడా యూరియాను అందించేందుకు సిద్ధం చేశామన్నారు.
News September 9, 2025
ప్రొద్దుటూరు: బార్‌లుగా మారిన బ్రాంది షాపులు

మద్యం దుకాణల్లో బల్లలు వేసి, మద్యం తాగించడానికి పర్మిట్ రూములకు అనుమతులు పొందారు. ప్రొద్దుటూరు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 మద్యం దుకాణాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 18, రూరల్ ప్రాంతంలో 3 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి మద్యం దుకాణాల యజమానులు పర్మిట్ రూముల ఏర్పాటుకు ప్రభుత్వానికి మున్సిపాలిటీలో ఏడాదికి రూ.7.50 లక్షలు, రూరల్‌లో రూ.5 లక్షలు చొప్పున 3 నెలలకు డబ్బులు చెల్లించారు.