News April 21, 2025
ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 21, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.41 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.56 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.49 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 21, 2025
ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.
News April 21, 2025
IPL కోసం మటన్, పిజ్జాకు వైభవ్ దూరం: కోచ్

RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి మటన్, పిజ్జా అంటే చాలా ఇష్టమని కోచ్ మనీశ్ వెల్లడించారు. గతంలో ఎంత పెట్టినా మిగిల్చేవాడు కాదని, అందుకే బొద్దుగా ఉన్నాడని తెలిపారు. IPLలో బరిలో దిగడం కోసం వాటికి దూరంగా ఉండిపోయాడన్నారు. అతనికి బ్రియాన్ లారా అంటే ఇష్టమని చెప్పారు. లారాతోపాటు యువరాజ్ మిక్సింగ్‌లా సూర్యవంశీ కనిపిస్తాడని పేర్కొన్నారు. అతను తప్పకుండా ఎక్కువకాలం క్రికెట్ ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు.
News April 21, 2025
కాల్పుల విరమణలోనూ రష్యా దాడులు: జెలెన్‌స్కీ

ఈస్టర్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన <<16153897>>కాల్పుల విరమణ<<>> బూటకమని ఉక్రెయిన్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ భూభాగంలో ఆదివారం 50కి పైగా బాంబులు, డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. వైమానిక దాడులు జరగకపోవడం ఊరట కలిగించే అంశమని చెప్పారు. క్షేత్రస్థాయిలో పుతిన్ సైన్యంపై పట్టు కోల్పోయినట్లు కనిపిస్తోందన్నారు. ఆ దేశానికి యుద్ధానికి ముగింపు పలికే ఆలోచన లేదని పేర్కొన్నారు.