News April 21, 2025
HYD: అర్ధరాత్రి యువతిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువతి ప్రాణాలను పోలీసులు కాపాడారు. స్థానికుల వివరాలు.. రాత్రి 11:30 సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి ఓ యువతి దూకబోయింది. ఇదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్, కృష్ణయ్య అప్రమత్తమయ్యారు. చెరువులో దూకే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకొని బ్రిడ్జి మీదకు తీసుకెళ్లారు. ఆమెను రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.
Similar News
News April 21, 2025
జనగామ: ‘మూడు దశాబ్దాల జ్ఞాపకాలు’

జనగామ జిల్లా మండల కేంద్రమైన పాలకుర్తి ఉన్నత పాఠశాలలో 1990-91 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆనందోత్సవాలతో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 8 మంది అకాల మృతి చెందగా వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు అప్పటి గురువులను సన్మానించారు.
News April 21, 2025
కాల్పుల విరమణలోనూ రష్యా దాడులు: జెలెన్‌స్కీ

ఈస్టర్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన <<16153897>>కాల్పుల విరమణ<<>> బూటకమని ఉక్రెయిన్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ భూభాగంలో ఆదివారం 50కి పైగా బాంబులు, డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. వైమానిక దాడులు జరగకపోవడం ఊరట కలిగించే అంశమని చెప్పారు. క్షేత్రస్థాయిలో పుతిన్ సైన్యంపై పట్టు కోల్పోయినట్లు కనిపిస్తోందన్నారు. ఆ దేశానికి యుద్ధానికి ముగింపు పలికే ఆలోచన లేదని పేర్కొన్నారు.
News April 21, 2025
కడప: ఇవాళ ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా

కడప నగర పరిధిలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో 21 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.