News April 21, 2025
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

జనగామ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10:30 గంటలకు ప్రారంభమయ్యే ప్రజావాణి కార్యక్రమంలో మండలాల ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా మండలాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
Similar News
News April 21, 2025
అథ్లెటిక్స్ జట్టు కోచ్ రమేశ్‌పై సస్పెన్షన్ వేటు

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ జట్టు కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్‌ను ‘నాడా’ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు తెలుగు అథ్లెట్లు శ్రీనివాస్, ప్రత్యూష సహా మొత్తం ఏడుగురిపై వేటు వేసింది. క్రీడాకారులు డోపింగ్ టెస్టులకు శాంపిల్స్ ఇవ్వకుండా రమేశ్ సహకరించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విచారణ అనంతరం నాడా ఈ చర్యలు చేపట్టింది. తాను ఏ తప్పూ చేయలేదని, తప్పు చేసేవారిని ప్రోత్సహించలేదని రమేశ్ తెలిపారు.
News April 21, 2025
కొమురం భీమ్ జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా తిర్యాని 43.9 ఉష్ణోగ్రత నమోదు కాగా పెంచికల్‌పేట, వాంకిడి 43.8, బెజ్జూరు 43.7, ఆసిఫాబాద్, కౌటాల, కెరమెరి లో 43.7, దహేగాం, రెబ్బెన 43.5, సిర్పూర్ టి 43.4, కాగజ్నగర్ 43.2, జై నూర్ 42.8, చింతల మానేపల్లి 42.7, సిర్పూర్ యు 42.6, లింగాపూర్ 41.4 గా నమోదయింది.
News April 21, 2025
ఆసిఫాబాద్: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.